సినిమాపవన్‌ కల్యాణ్‌ టైటిల్‌తో యాంకర్‌ ప్రదీప్‌ సినిమా

పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌తో యాంకర్‌ ప్రదీప్‌ సినిమా

బుల్లితెరపై యాంకర్‌గా పాపులారిటీ సంపాందించుకున్నారు ప్రదీప్‌ మాచిరాజు. ఫీమేల్‌ యాంకర్‌గా ప్రదీప్‌కు వున్న క్రేజ్‌ ఇతర ఫీమేల్‌ వ్యాఖ్యాతలకు లేదంటే అతిశయోక్తి కాదేమో.. బుల్లితెరపై తెచ్చుకున్న పేరును దృష్టిలో పెట్టుకుని నటనపై వున్న మక్కువతో 30 రోజుల ప్రేమకథ చిత్రంతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేశాడు ప్రదీప్‌. అయితే ఆ సినిమా ప్రదీప్‌కు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చినా అనుకున్నంత విజయం సాధించలేదు.
ప్రస్తుతం ఈ యువ హీరో తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ సినిమా కోసమే టీవీ షోలకు దూరంగా వుంటున్నాడు. సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం ద్వారా బబర్ధస్త్‌తో పాటు పలు కామెడీ షోలకు దర్శకత్వం వహించిన నితిన్‌, భరత్‌లు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్‌ను నిర్ణయించారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన మొదటి చిత్రం టైటిల్‌ కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, మోషన్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు మేకర్స్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యూత్‌కు నచ్చే ఓ మంచి ప్రేమకథను కూడా జోడించారట. డిసెంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article