⏭️మాకు ఇ ఏఈ వద్దంటూ రాష్ట్ర ముఖ్యమంత్రికు స్థానిక ఎమ్మెల్యే కు మోరా..
మడకశిర:విద్యుత్ ఏఇ పనితీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరాపురం మండలం పులికుంట గ్రామ రైతులు బుధవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ముందు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏఇ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ ను అందించడం లేదని వాపోయారు. నాణ్యమైన విద్యుత్ కరువై సర్వీస్ వైర్లు, మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.11 కె.వి లైన్లను మరమ్మత్తులు చేయకపోవడంతో విద్యుత్ సరఫరా పట్ల గ్రామంలో నిత్యం తీవ్ర అంతరాయం కలుగుతుందని అధికారులు అస్తవ్యస్తగా విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. వినియోగదారుల నుండి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తూ సర్వీస్ మాత్రం ఇవ్వడం లేదంటూ వాపోయారు. అధికారుల పనితీరు మాటల్లోనే మాత్రమే ఉందని చేతుల్లో లేదని విమర్శించారు. మండల ఏఇ దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లిన స్పందించడం లేదని మాకు ఈ ఏఇ వద్దని స్థానిక ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రికు మొరపెట్టుకున్నారు.