పిఠాపురం :కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వీడియో మిత్రులతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల చేయనుంది… దానికి అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గంలో పేద విద్యార్ధిని, విద్యార్ధులు, నిరుద్యోగ యువతీ యువకుల కోసం “వర్మాస్ కావ్య ఫౌండేషన్” ద్వారా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ.ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ గారి అధ్యక్షతన, DSCలో S.G.T., అభ్యర్ధులకు కోచింగ్ సెంటర్ ను కాకినాడ శ్రీ బ్రహ్మాస్ కోచింగ్ సెంటర్ వారి ద్వారా ఉచిత DSC కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. సీట్లు పరిమితం కావునా పిఠాపురం నియోజకవర్గంలోని SGT అభ్యర్ధులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి. • క్లాసులు కోసం పేర్లు నమోదు చేయు స్థలం : పిఠాపురం రాజావారి కోటలో, అంజనా కాలేజీ పక్కన గల తెలుగుదేశం పార్టీ కార్యలయంలో.
సంప్రదించవలసిందిగా చెప్పారు .
మొబైల్ నంబర్స్ : 8978869999. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు నల్ల శ్రీను కౌన్సిలర్లు నగేష్ కోళ్ల బంగారు బాబు రాయుడు శ్రీను గొర్ల స్వామి పట్టా గణేష్ శ్రీను రాజా రామకృష్ణ కేశవరపు కృష్ణ సుబ్రహ్మణ్యం సత్తిబాబు గొర్ల తదితరులు పాల్గొన్నారు