ఎలక్షన్ పర్యవేక్షించిన మరెడ్డి శ్రీనివాస్, తుమ్మలబాబు, తుమ్మలపల్లి రమేష్, పంతం నానాజీ, తుమ్మలపల్లి చందు

జగ్గంపేట :ఈరోజు జరిగిన పిఠాపురం కో-ఆపరేటివ్ బ్యాంకు కి జరిగిన ఎలక్షన్ లో ఐదు కి ఐదు డైరెక్టర్స్ ని కూటమి ప్రభుత్వం గెలుచుకుంది.ఉదయం నుండి పిఠాపురం ఇంచార్జ్ మరెడ్డి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మల పల్లి రమేష్ గారు ఎలక్షన్ పర్యవేక్షించారు. సాయంత్రం ఫలితాలు వెళ్లడైనా తర్వాత జనసేన శ్రేణులు బాణాసంచా కాల్చి, తీన్మార్ డాన్స్ లతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరైయి డైరెక్టర్స్ గా ఎన్నికయినా వారిని శుభాకాంక్షలు తెలియచేసి సత్కరించారు.