ఈనెల 7వ తేదీ సోమవారం జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ వద్ద దివ్యాంగుల ఉపకరణాల పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏర్పాట్లను రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, కాకినాడ జిల్లా టిడిపి విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్న దొర, జగ్గంపేట, గండేపల్లి ఎంపీడీవోలు చంద్రశేఖర్, నాతి బుజ్జి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం ఉదయం 8 గంటల నుండి జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణ విభిన్న ప్రతిభవంతులకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా వారికి ఉపకరణాల అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాల నుంచి విభిన్న ప్రతిభవంతులు విచ్చేస్తారని వీరికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కృష్ణంరాజు, గండేపల్లి పరిపాలనాధికారి కర్రీ చందర్రావు, జగ్గంపేట సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.