జీలుగుమిల్లి :ఏడుకొండలవాడు కళ్ళు తెరిస్తే లడ్డు పాపం ఊరికే పోదువు అని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ సందా ప్రసాద అన్నారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని,ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నారని ప్రస్తుత ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ విషయాన్ని ఖండిస్తూ చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళన కలగాలని కోరుతూ ఈరోజు అరి జగదాంబ అమ్మవారి ఆలయంలో మండల వైసిపి శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మల్లం వసంతరావు,వైస్ ఎంపిపి సోమగాని శ్రీనివాసరావు, మాజీ సొసైటీ అధ్యక్షులు బొదా శ్రీనివాసరెడ్డి,మండల వైసిపి అధ్యక్షులు సందా ప్రసాద్,సచివాలయ కన్వీనర్ వనమా రామకృష్ణ,సున్నం సురేష్,బి.ప్రేమ్ కుమార్,తగరం రాంబాబు,గంధం బోస్,చిట్టిబొమ్మ శ్రీను, ముడియం నాగేశ్వరరావు,బోడిక భోగేశ్వరరావు,కొప్పుల సత్యనారాయణ, కుసుమ వెంకట్,కొప్పుల ప్రసాద్,మొగమటం మంగరాజు,పంబి సాయి గౌతమ్,కక్కిరాల చక్రి,షామిల్ బాషా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.