టిడిపి పార్టీ నాయకులను అక్కున
చేర్చుకుంటాం
ట్రైకర్ చైర్మన్ శ్రీనివాసరావు
జీలుగుమిల్లి :టిడిపి క్యాడర్ అధైర్యపడుద్దని అందర్నీ ఆక్కున చేర్చుకుంటామని ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావు అన్నారు. జీలుగుమిల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన టిడిపి మండల అధ్యక్షులు సాయి ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. గ్రామస్థాయి నుండి పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసుకుంటామని అందరికీ అండదండలు అందిస్తామని ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇన్నేళ్లు పార్టీకి అండదండగా ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని ఆయన అన్నారు. సాయి ఇంటి వద్ద శ్రీనివాసరావు అని పలువురు పూలమాలలు దుష్యాలలతో సన్మానించారు. టిడిపి రైతు జిల్లా ఉపాధ్యక్షులు ఉండవెల్లి సోమ సుందరం, మండల టిడిపి అధ్యక్షులు సాయి, స్వర్ణ వారి గూడెం పంచాయతీ సర్పంచి నూపా వెంకటేశ్వరరావు, తాటి ఆకుల గూడెం సర్పంచి వనమా రాంబాబు, అంకంపాలెం సర్పంచి బి జగ్గారావు, ఎంపీటీసీ శ్రీను, జీలుగుమిల్లి టిడిపి కార్యదర్శి నందికొళ్ళ వీర్రాజు, కుకునూరు, వేలూరుపాడు మండలాల నుండి పలువురు అభిమానులు వచ్చి చైర్మన్ సన్మానించారు.