Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఒంటిమిట్ట మండల టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి కమిటీల నియామకం

ఒంటిమిట్ట మండల టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి కమిటీల నియామకం

ఒంటిమిట్ట మండల అధ్యక్షునిగా గురిగింజ కుంట శివకుమార్ నాయుడు ఎంపిక

ఒంటిమిట్ట: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రాజంపేట నియోజకవర్గం, ఒంటిమిట్ట మండలానికి చెందిన పాల ఏకరి కులస్తులు భాను హరి రెసిడెన్సి ఆఫీసు నందు శనివారం నాడు టిడిపి బీసీ సాధికార సమితి పాల ఎకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గము తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ఒంటిమిట్ట మండలం చింతరాజు పల్లి గ్రామానికి చెందిన పాల ఏకరి కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసినారు. పాల ఏకరి కులస్తులకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది అని అన్నారు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన వారికి పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి అన్నారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండల కమిటీలను ఏర్పాటు చేశారు. టిడిపి బీసీసాధికార సమితి పాలఏకరి ఒంటిమిట్ట మండలాధ్యక్షులు గా గురిగింజ కుంట శివకుమార్ నాయుడు ఉపాధ్యక్షుడిగా కోటికే ప్రతాప్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగాగురిగింజ కుంట శివకుమార్ నాయుడు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా గురిగింజ కుంట ఆనందకుమార్ నాయుడు ఒంటిమిట్ట అధికార ప్రతినిధిగా కోటికే బ్రహ్మయ్య నాయుడు గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎంపికైన పాల ఏకరి ఒంటిమిట్ట మండలాధ్యక్షులు శివకుమార్ నాయుడు మాట్లాడుతూ మాపై ఎంతో నమ్మకంతో మండల అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురుగించుకుంట శివప్రసాద్ నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండల అధ్యక్షునిగా మండలంలోని ప్రతి పాల ఏకరి కులస్తుల్ని కలుపుకొని పోయి కుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధిని ఎప్పటికీ ఆయన వెంట నడుస్తామని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాజంపేట కమిటీ మెంబర్ గురిగింజకుంట రెడ్డి మల్లప్ప నాయుడు,జనసేన నాయకుల రామా శ్రీనివాస్, గురిగింజకుంట రమేష్ నాయుడు,గురిగింజకుంట ప్రేమ సాగర్ నాయుడు,మద్దె నరసింహనాయుడు,మెరుగు నందీశ్వర్ నాయుడు రవీంద్ర, శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article