కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగుళూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరోపణల ప్రకారం, సీతారామన్ పారిశ్రామికవేత్తలను బెదిరించి, వారి నుంచి పెద్ద మొత్తంలో నగదు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ పార్టీ ఖాతాలకు బదిలీ చేయించారని తెలిపినట్లు సమాచారం. ఈ ఆరోపణలను జనాధికార సంఘర్ష పరిషత్‌కు చెందిన ఆదర్శ్ అయ్యర్ మొదటగా ఫిర్యాదు చేశారు.అయ్యర్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో, ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు, తిలక్ నగర్ పోలీసులను నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేశారు.ఇప్పటివరకు, పోలీసులు కేంద్రమంత్రిపై కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.