తమిళనాడు మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీకి మనీలాండరింగ్ కేసులో సుప్రీం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. సెంథిల్ బాలాజీపై రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం నగదు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 2023 జూన్ 14న ఆయనను ఇడి అరెస్ట్ చేసింది.ఇందులో, సెంథిల్ బాలాజీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహతగి, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.మద్రాస్ హైకోర్టు మరియు స్థానిక కోర్టులు గతంలో బాలాజీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి. అయితే సుప్రీం కోర్టు ఇప్పుడు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేయడం, ఈ కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చు.