అక్టోబర్ 1 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీకి స్వల్ప ఊరట లభించింది. విశాల్ గున్నీ ఈ కేసులో ఆరో నిందితుడిగా (A6) ఉన్నారు. తనపై నాన్-బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో, ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, అక్టోబర్ 1వ తేదీ వరకు విశాల్ గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది.జెత్వానీ కేసులో మొదటి నిందితుడిగా (A1) ఉన్న కుక్కల విద్యాసాగర్ ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్నాడు. ఈ కేసులో ఇతర ఐపీఎస్ అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు, వీరిలో పీఎస్సార్ ఆంజనేయులు (A2), కాంతి రాణా (A3), వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు (A4), ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ (A5) లు ఉన్నారు.