తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రక్షుబ్దత సృష్టిస్తోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త భక్తులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదంలో కీలకంగా మారాయి.భక్తులు, సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు వరకు ప్రతిఒక్కరు ఈ కల్తీ వ్యవహారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ప్రసాదంలో కల్తీ జరగడాన్ని జీర్ణించుకోలేని భక్తులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఈ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన చంద్రబాబు నాయుడుపై లడ్డూ విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దీనివల్ల భక్తులు గందరగోళానికి గురవుతున్నారని ఆరోపించారు. సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును సాక్షిగా సమగ్ర విచారణ కోసం కమిటీ వేయాలని పిటిషన్‌లో కోరారు.అదే విధంగా, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నేడు మధ్యాహ్నం 2:15 గంటలకు కోర్టు విచారణ జరపనుంది.