Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలురుద్రంకోట గ్రామంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం

రుద్రంకోట గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం

వేలేరుపాడు :వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి వంద రోజులలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అందించిన సుపరిపాలన గురించి కూటమి నాయకులు, అధికారులు ప్రజలకు వివరించి ,కరపత్రాలు పంపిణీ చేయటం జరిగింది. నిరుద్యోగ యువతకు మెగా డియస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ,పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలతోనే 175 అన్న క్యాంటీన్లు,కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పించన్లు పెంపు,ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు ,లాండ్ టైటిల్ యాక్ట్ రద్దు,వరదల సమయంలో విజయవాడ నగరం అతలాకుతలం ఐన్నప్పుడు ఆదుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.అదేవిధంగా దసరా,దీపావళి పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు,మహిళలకు ఉచిత బస్సు,వంటి పథకాలు మొదలు అవుతాయి అన్నారు.అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులలో ఒక లక్ష రూపాయలు కూడా రుద్రంకోట గ్రామానికి ఇవ్వడం జరిగిందనారు.ప్రజా శ్రేయస్సు ముఖ్యం అని ప్రజల దీవెనలతో మరింత ముందుకు సాగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఐటీడిపి ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు శావిలి సుభాష్ చంద్రబోస్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి కొవ్వాల క్రాంతికుమార్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సారే బాబ్జీ, సావిలి శివ,బోల్లిన బాబ్జీ,బచ్చలకూర వెంకట కృష్ణారావు, గారపాటి మురళి, మద్దినశెట్టి వెంకన్నబాబు, కొవ్వల నరేష్, సచివాలయం ఉద్యోగస్తులు జి దుర్గారావు, తెల్లం నవీన్, సున్నం మీన, ఓంకార్ లుపల్గొన్నారు. శివకాశి పురంలో ఇదే కార్యక్రమంలో ఆ గ్రామ నాయకులు కుకునూరు సత్తిపండు, తదితరులు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని టిడిపి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article