Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఅక్టోబర్ 2 నుంచి.. కొలికపూడి పశ్చాతాప‌యాత్ర !

అక్టోబర్ 2 నుంచి.. కొలికపూడి పశ్చాతాప‌యాత్ర !

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహా ప్రసాదం లడ్డూ అంశంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ పాదయాత్ర చేసేందుకు నిశ్చయించారు. ఐదేళ్లపాటు జరిగిన అపచారానికి క్షమించు ప్రభు అంటూ వెళ్లేందుకు ఆయన నిర్ణయించుకున్నారు.కలియుగంలో జరిగిన అత్యంత అపవిత్ర సంఘటనగా ప్రస్తావిస్తున్న ఆయన తన పాదయాత్ర ద్వారా క్షమించమని ఏడుకొండలస్వామిని వేడుకోనున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఆద్యంతం పాదయాత్ర కొనసాగనంది.అక్టోబర్ 2 వ తేదీ ఉదయం 9 గంటలకు తిరువూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి నుండి ఈ పాదయాత్ర తిరుమలకు ప్రారంభం కానుంది. జరిగిన అపచారాన్ని క్షమించమంటూ, నియోజకవర్గ రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article