జగ్గంపేట :జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని జగ్గంపేట మండలాధికారులు గ్రామ అధికారులు ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి ఈ 100 రోజుల్లో చేసిన మంచి పనులు అని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే నెరవేరుస్తున్నారని, ఆర్థిక భారం అయినా సరే పెన్షన్ 3000 నుంచి 4000 కు పెంచడం జరిగిందని, అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసామని, పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, గత ప్రభుత్వం అడ్డగోలుగా తెచ్చిన ల్యాండ్ టైటాలింగ్ యాక్ట్ రద్దు చేశామని అన్నారు.అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని గ్రామపంచాయతీలకు ఒకేసారి గ్రామసభ లు నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను గ్రామ సభల్లో చర్చించి ఎస్టిమేట్ లు తయారుచేసి వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించే విధంగా చేశారని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంద రోజుల పాలన దిగ్విజయంగా జరిగిందని అన్నారు.ఆర్ధిక కష్టాలను అధిగమించి ఒకటవ తారీఖునే పెన్షన్,ఉద్యోగులను జీతాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.వంద రోజుల్లోనే ప్రజల మనసులు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం పోటాపోటీగా చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.