ముదిగుబ్బ :ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలను ఆదివారం ముదిగుబ్బలో కూటమి పార్టీల శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. రాష్ట్ర టిడిపి నాయకులు రమేష్ బాబు, టిడిపి, బిజెపి మండల కన్వీనర్లు ప్రభాకర్ నాయుడు, సోమల ప్రకాష్, టిడిపి మండల క్లస్టర్ ఇన్చార్జి తుమ్మల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ కూడలినందున్న బస్సుషెల్టర్ ముందు శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకొని భారీకేక్కోసి పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అదేవిధంగా అన్నప్రసాదాలు చేపట్టారు. ఈసందర్భంగా పరిటాల శ్రీరామ్ తండ్రి మాజీమంత్రి పరిటాలరవీంద్ర పార్టీకి చేసిన సేవలను నాయకులు గుర్తుచేస్తూ అదేవిధంగా శ్రీరామ్ ప్రజాసేవలో నడుస్తూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు విలువ కట్టలేని సహాయ సహకారాలు అందిస్తున్నారనీ అన్నారు. పార్టీలోనూ మరిన్ని ఉన్నత పదవులు ఆయన చేపడితే ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు ఉపయోగపడతారని ఆశించారు. ఈకార్యక్రమంలో వినోద్ బాబు, కోట్లబాబి, గుర్తి నంద, నాగలగుబ్బల శేఖర్, కొలసాని చంద్ర, అస్వార్థరెడ్డి, తుమ్మలసూరి, గోపాల్ రెడ్డి, ముత్తులూరువెంకటేష్, శివారెడ్డి, వెలుగు నరసింహులు, నారాయణస్వామి, కొలసాని, బండ్లపల్లి శివయ్య, రామ్మూర్తి, చిన్నశీన, రామకృష్ణ, జంపుశీన తదితరులు ఉన్నారు.