ఐసిడిఎస్ ఏసిడిపిఓ ఎన్.శోభారాణి
ఒంటిమిట్ట:పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఐసిడిఎస్ ఏసిడిపిఓఎన్.శోభారాణి అన్నారు.గురువారం మండలంలోని జంగాలపల్లె అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనిగర్భవతులు,బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహనకల్పించారు.గర్భవతులకు సామూహిక సీమంతం నిర్వహించి బాలామృతంతో పిండి వంటలు తయారు చేసి పిల్లలకు ఎలా తినిపించాలో తల్లులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏసీడీపీఓ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా లభించే పోషకాహారం క్రమం తప్పకుండాభుజించాలన్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులకు జింక్ ఫుడ్స్ పెట్టకూడదని కేవలం కూరగాయలు,ఆకుకూరలు, పండ్లు,చిరుధాన్యాలు విరివిరిగా వాడాలని శారీరక,మానసిక ఆరోగ్యానికి అవిఎంతోతోడ్పడతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీవిద్య,అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.