- బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు పి.సుష్మా
వేంపల్లె:మొక్కల పెంపకం సామాజిక బాధ్యత అని బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు పి.సుష్మా అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా సేవ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. వాతావరణ సమతుల్యతకు మొక్కలు దోహద పడుతాయన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక చెట్టును నాటాలని కోరారు. బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి గాలి హరిప్రసాద్, బిజెపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతు సుమన్, సునీల్, ప్రసాద్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.