వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును “అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి” అని ఆయన సంబోధించారు. చంద్రబాబు పరివారం కూడా అదే ధోరణిలో ఉందని వ్యాఖ్యానించారు. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనబడదని చెప్పిన విజయసాయి, చంద్రబాబు పర్యావరణానికి హానికరమైన కృష్ణానది ఒడ్డున అక్రమంగా నిర్మించిన నివాసంలో ఉంటూ, ఇతరుల ఇళ్లను కూలగొట్టే నైతిక అధికారం లేదని ప్రశ్నించారు.చంద్రబాబుకు చెందిన అక్రమ కట్టడాన్ని మొదట కూలగొట్టాలంటూ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇంకా ప్రతిపక్షం తరహాలోనే వ్యవహరిస్తోందని, గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి, ప్రజల కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని విజయసాయి రెడ్డి సూచించారు.