ప్రధాని నరేంద్ర మోదీ నేడు 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానం కలిగిన వ్యక్తులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వంటి ప్రముఖులు ఉన్నారు.రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీని “దార్శనిక నేత”గా అభివర్ణిస్తూ, ఆయన దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. మోదీ తన బలమైన నాయకత్వంతో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, ప్రపంచం కూడా ఆయన నాయకత్వాన్ని గుర్తించిందని కొనియాడారు.మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకు సుస్థిర ఆరోగ్యం, దీర్ఘాయువు కోరుకుంటున్నట్టు తెలిపారు.

