కదిరి :కదిరి రూరల్ పరిధిలోని ఎరుకలవాండ్లపల్లి సమీపంలో ఉన్న హరీష్ పాఠశాలలో హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హిందీ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1949 సంవత్సరంలో సెప్టెంబర్ 14న హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. కబీర్దాస్, తులసీదాస్, మీరాబాయి, ప్రేమ్ చంద్ లాంటి గొప్ప కవులు హిందీ భాషలో రచనలు, పద్యాలు రచించి ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి హిందీ భాషపై పట్టు సాధించాలని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రల్లో మాతృభాషతో పాటు హిందీ భాష మాట్లాడడం జరుగుతోందని చెప్పారు. తొలుత హిందీ మహా కవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు, గీతాలు, అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

