ప్రజాభూమి,తాడిపత్రి: భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ చేపట్టారు.
తాడిపత్రి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి టి.రంగయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. సిపిఐ కార్యకర్తలు హుండీలు చేపట్టి ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, ప్రజలతో విరాళాలు సేకరించారు. ఈసందర్భంగా రంగయ్య మాట్లాడుతూ అడిగిన వారంతా లేదనకుండా తమకు తోచిన సహాయాన్ని హుండీలలోకి వేసి దాతృత్వం చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి
నాగరంగయ్య, నారాయణ రెడ్డి, చిన్న కుళ్ళాయప్ప, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.