బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలోనూ హైడ్రాను చేర్చే యోచన
తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణలను నిరోధించడంలో మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆక్రమణలపై నిరంతరం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం హైడ్రా ఆక్రమణలను కూల్చివేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో, ఇప్పుడు బిల్డింగ్ అనుమతుల ప్రక్రియలో కూడా హైడ్రాను చేర్చాలనే నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం ప్రకారం, నగరంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి హైడ్రా నుంచి కూడా ఎన్ఓసీ పొందడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానం అమలు చేయడం ద్వారా బఫర్ జోన్ మరియు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధుల్లో అక్రమ నిర్మాణాలు నియంత్రించబడ్డాయి. హైడ్రా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే వాటి ఇంటి నంబర్, కరెంట్, మరియు నీటి కనెక్షన్లు తొలగించనున్నట్లు సమాచారం.ఈ కొత్త చర్యల ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.