ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. పెండ్యాల శ్రీనివాసరావు, చంద్రబాబు ప్రభుత్వంలో 15 సంవత్సరాలకు పైగా పీఎస్ (ప్రైవేట్ సెక్రటరీ) గా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2023 సెప్టెంబర్ 29న ఆయనపై సస్పెన్షన్ విధించబడింది, తదుపరి అక్టోబర్ 26న ఆయనపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది.ప్రధానంగా ఆయనపై విధులకు హాజరుకాకపోవడం, అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్లడంపై అభియోగాలు ఉన్నాయి. 2024 ఆగస్ట్ 1న సమర్పించిన విచారణ నివేదికలో కొంత వరకు ఈ అభియోగాలు నిరూపితమయ్యాయని వెల్లడైంది. అయితే ప్రభుత్వం ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేసి, ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిర్ణయం తీసుకుంటూ, శ్రీనివాసరావుకు తన విధుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఆయనను విధుల్లోకి తీసుకుంటున్నట్టు జీవోలో పేర్కొంది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.
