ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు ప్రమాదవశాత్తు కొట్టుకురాలేదని, ఈ ఘటన ఒక కుట్ర అని పేర్కొన్నారు. ఆమె ప్రకటన ప్రకారం, ఈ ఐదు బోట్లు బ్యారేజీకి ఢీకొన్న ఘటన మానవ నిర్మిత (మేన్ మేడ్) ప్రమాదం అని తేలిందని, ఎన్డీయే ప్రభుత్వం మరియు చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారని అనుమానం వ్యక్తం చేశారు.పెద్ద బోట్లను నైలాన్ తాడుతో కట్టడం అనేది సాధారణంగా జరిగే విషయం కాదని, ఇది ఇష్టప్రాయంగా చేసిందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై జరిగిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని చెప్పారు.ఇది కేవలం కౌంటర్ వెయిట్లను ఢీకొన్నందుకే ప్రమాదం తగ్గిందని, కానీ డ్యామ్ పిల్లర్లను తాకి ఉంటే మరింత పెనుప్రమాదం జరిగి ఉండేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.