తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన, విశాఖపట్నం చేరుకున్న తర్వాత జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత, టీడీపీ నాయకత్వంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు మంత్రివర్గంలో చేరిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్‌గా నియమితులయ్యారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పల్లా, ప్రస్తుతం పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.