తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అనేక అరాచకాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.వైసీపీ నేతలు చెలరేగి, అమాయక మహిళల జీవితాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు. గతంలో గంట, అరగంట మంత్రుల వ్యవహారం, ఇటీవల విజయసాయిరెడ్డి మరియు శాంతి అంశం, ఇప్పుడు మరో మంత్రితో సకల శాఖ మంత్రి చేసిన అనుచిత చర్యల గురించి ఆయన ప్రస్తావించారు. జగన్ హయాంలో ఎవ్వరికీ రక్షణ లేదని, వైసీపీ నాయకులు సామాన్య ప్రజల జీవితాలతో ఎలా తారుమారు చేస్తోన్నారో తెలిపారు.వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నియంత్రణలు లేకుండా నడుస్తోందని, దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన కారణమని వెంకన్న ఆరోపించారు. చీటింగ్ కేసుల్లో పోలీసులు త్వరగా స్పందించినా, ఇతర కేసుల్లో సరైన దర్యాప్తు జరగకపోవడాన్ని ప్రశ్నించారు. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.వెంకన్న, జిత్వానీ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు.