తాడిపత్రిలో ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా, ఎస్పీకి శాలువా కప్పి, మెమొంటోతో సన్మానించారు.మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల తీరులో మార్పు రాలేదని, కొంతమంది పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని జేసీ అస్మిత్ రెడ్డి విమర్శించారు. తాడిపత్రి ఇసుక మాఫియా గురించి ఎన్జీటీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.ఇసుక అక్రమ రవాణా కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయమని అడిగినా, సానుకూల స్పందన అందలేదు. ఇసుక అక్రమ రవాణా పై నెల రోజులుగా లెటర్లు రాస్తున్నా, ఎవరూ స్పందించకపోవడం వల్ల తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలిపారు.ఇసుక మాఫియాపై ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది పోలీసుల వైసీపీ జెండా కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని కూడా ఆరోపించారు.