హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో సితా గ్రాండ్ హోటల్ యజమాని ఓయో రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టి కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘాతుకం బయటపడింది. ఈ ఘటన, ఓ యువ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.హోటల్ యజమాని, ఓయోతో ఒప్పందం కుదుర్చుకుని గదులు అద్దెకు ఇస్తూ, రహస్యంగా గదులలో కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ కెమెరాలు ద్వారా కస్టమర్ల సన్నిహిత క్షణాలను రికార్డు చేసి, ఆ వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజేవాడని విచారణలో ఒప్పుకున్నాడు.ఈ దారుణం చాలాకాలంగా జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇప్పటికే అనేక జంటలను ఈ విధంగా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు.సమీప కాలంలో ఓ జంటను కూడా ఇలాగే బెదిరించడంతో, వారు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, సితా గ్రాండ్ హోటల్‌లో సోదాలు నిర్వహించి హిడెన్ కెమెరాలను గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి, రెండు ఫోన్లు, సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు.