Wednesday, September 17, 2025

Creating liberating content

తాజా వార్తలుబాలయ్య సినీ ప్ర‌స్ధానం 50 ఏళ్ల సెలబ్రేషన్స్..‌చంద్ర‌బాబుకు ఆహ్వానం

బాలయ్య సినీ ప్ర‌స్ధానం 50 ఏళ్ల సెలబ్రేషన్స్..‌చంద్ర‌బాబుకు ఆహ్వానం

నటసింహ నందమూరి బాలకృష్ణ 50వ వసంతాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ఆహ్వానించారు.తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత కె. ఎల్. నారాయణ, నిర్మాత జెమినీ కిరణ్, నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు తదితరులు హైదరాబాద్‌లోని చంద్రబాబుని కలసి ఈ వేడుకకు ఆహ్వాన పత్రం అందజేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించి, కార్యక్రమానికి హాజరుకావడానికి అంగీకరించారు. అంతేకాదు, ఇండస్ట్రీ సమస్యలు మరియు విశేషాలపై వారు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article