Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఅనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా ప్రమాదం .. నలుగురు కార్మికులకు గాయాలు

అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా ప్రమాదం .. నలుగురు కార్మికులకు గాయాలు

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరువక ముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన కార్మికులను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిని చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.గాయపడిన కార్మికులను ఝార్ఖండ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు హోంమంత్రి, ఇతర అధికారులను ఆదేశించారు.విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఎంపీ సీఎం రమేశ్ మరియు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రతకు సంబంధించిన ప్రశ్నలను మరోసారి లేవనెత్తింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article