వి.ఆర్.పురం :ప్రభుత్వ పశు వైద్యాధికారులు పశువులకు అందిస్తున్న వ్యాక్సిన్లను మీ పశువులకు వేయించండి, దీంతో మీ పశువులు జబ్బుల భారీ పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని రేఖపల్లి సర్పంచ్ పూనెం సరోజిని అన్నారు. మండలంలోని రేకపల్లి గొల్లగూడెం గ్రామంలో మంగళవారం మండల పశు వైద్య అధికారిని వారి సిబ్బంది ఆద్వర్యంలో పశువులకు అందిస్తున్న వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేకపల్లి గొల్లగూడెం లోనే పశు సంపద ఉన్నదని, ఇటీవల కాలంలోనే గోదావరి వరదలు వలన పశువులకు, గొర్రెలు, మేకలు, రోగాలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని నివారించడానికి పశు వైద్య అధికారులు నిత్యం పర్యవేక్షణ ఉండాలని ఆమె అధికారులను కోరారు. అలాగే పశువులు జబ్బులు నివారణకు పశు వైద్యులు సూచన మేరకు వ్యాక్సిన్లు ఇతర మందులను పశు యజమానులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పినబోయిన శ్రీను, సరిహద్దు రాజేశ్వరరావు , కుంచం శ్రీను వెట్నారి డిపార్ట్మెంట్ మండల స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

