పిఠాపురం :కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ లో దోమల రహిత సమాజమే లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని డాక్టర్ జయరాం అన్నారు. మంగళవారం పిఠాపురం పట్టణంలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల నిర్మూలన పై ర్యాలీ నిర్వహించి, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డాక్టర్ జయరాం మాట్లాడుతూ… దోమల వ్యాప్తి పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అన్నారు లార్వ ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, టైఫాయిడ్, బోదవ్యాధి వంటి ప్రాణాంతక రోగాలు వ్యాప్తి చెంది అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ ఆర్ .చిన్నారి, ఏఎన్ఎం లు, ఆశ కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

