Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలుసమాజంలో చక్కటి విలువలు నెలకొల్పడమే లక్ష్యం

సమాజంలో చక్కటి విలువలు నెలకొల్పడమే లక్ష్యం

  • మానవత వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి

వేంపల్లె :సమాజంలో చక్కటి విలువలు నెలకొల్పడమే మానవత సంస్థ లక్ష్యమని వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలోని ఆయా పాఠశాలల విద్యార్థులు మానవత ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. శ్రీచైతన్య, ఉషాకిరణ్, శ్లోకా పాఠశాలల విద్యార్థులు, కరస్పాండెంట్ లు బి.చక్రపాణి రెడ్డి, బిఎస్ రమణారెడ్డి, బి.నవనీశ్వర్ రెడ్డిలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముందుగా వేంపల్లె సీఐ ఏ.సురేష్ రెడ్డి శాంతి ర్యాలీని ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా సర్వమానవాళీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించాలని కోరుతూ మానవత సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శాంతి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత కేంద్ర నియంత్రణ కమిటీ డైరెక్టర్ రామాంజులరెడ్డి, రిజినల్ డైరెక్టర్ బాలాజీ, అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రావణ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ యోగిస్వర్ బాబు, కోశాధికారి శ్రీకళ, అరుణ్, శశి, గంగయ్య, డాక్టర్ రాజారాం, డాక్టర్ రంగయ్య, రామమునిరెడ్టి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article