కాకినాడ జిల్లా జగ్గంపేట నవంబర్ 29: స్థానిక శెట్టిబల్జిపేట శివారు వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ ధన సత్తమ్మ అమ్మవారి ఆలయం వద్ద అర్ధనారీశ్వరుడు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. ఈ విగ్రహాన్ని జగ్గంపేట వాస్తవ్యులు సంగిరెడ్డి గణేశ్వరరావు, వీర్రాజు దంపతులు అందించడం జరిగింది. విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎస్వీఎస్ అప్పలరాజు, వైభోగుల కొండబాబు యాదవ్, సిమ్మా ముత్యాలు, పాలిక వీరబాబు, కొప్పు అర్జున్, సింహా దుర్గాప్రసాద్, కాకర నాగేశ్వరరావు, కిల్లి శంకర్, సంగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.