రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ
లోకేష్ పాదయాత్ర, పార్టీ కార్యక్రమాల రివ్యూ లో పాల్గొన్న పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు
కాకినాడ జిల్లా జగ్గంపేట నవంబర్ 30: స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన మండల టిడిపి అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు పాల్గొనగా లోకేష్ పాదయాత్ర, పార్టీ కార్యక్రమాల రివ్యూలో పరిశీలకులు నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.నారా లోకేష్ పునః ప్రారంభించిన యువ గళం పాదయాత్రకు కాకినాడ జిల్లాలోకి డిసెంబర్ ఒకటో తేదీ శుక్రవారం ప్రవేశిస్తున్న నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో అందరూ పాల్గొనాలని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు.
పార్టీ ఏ కార్యక్రమం చేపట్టిన పార్టీ పిలుపుమేరకు జగ్గంపేట నియోజకవర్గం అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనటం జరుగుతుందని అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ నాయకత్వంలో మన జిల్లాలోకి వస్తున్న లోకేష్ యువ గళానికి అధికంగా పాల్గొనే విధంగా మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు బాధ్యత తీసుకోవాలని కోరారు. పరిశీలకులు శేషారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారని మహిళా శక్తి చైతన్య రథయాత్ర విజయవంతంగా పూర్తయినందుకు నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని టెలిగ్రాం బాట్ లో అప్లోడ్ కార్యక్రమం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టిన ప్రమాణ పత్రాల పంపిణీ తొందరలోనే పూర్తి చేయాలని ఎన్నికలు మరో మూడు మాసాల్లో వస్తున్న నేపథ్యంలో వైసిపి రాక్షస పాలన ప్రజల్లోకి తీసుకెళ్లి సంకీర్ణ ప్రభుత్వంలో చేయబోయే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శిలు కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, మండల పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, చదరం చంటిబాబు, మంగ రౌతు రామకృష్ణ, కన్నబాబు, జీను మణిబాబు, అడపా భరత్ బాబు, పాండ్రంగి రాంబాబు, కొత్త కొండబాబు, పాఠం శెట్టి మురళీకృష్ణ , అడబాల భాస్కరరావు, బొల్లం రెడ్డి రామకృష్ణ, జంపన సీతారామచంద్ర వర్మ, కుర్ల చినబాబు, పాలకుర్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.