ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)లో కొత్త కార్యవర్గం ఎంపికైంది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధ్యక్షుడిగా, వెంకట ప్రశాంత్ ఉపాధ్యక్షుడిగా, సానా సతీష్ కార్యదర్శిగా, విష్ణు కుమార్‌రాజు జాయింట్ సెక్రటరీగా, శ్రీనివాస్ కోశాధికారిగా, గౌరు విష్ణుతేజ్ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.సెప్టెంబర్ 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నామినేషన్లకు శుక్రవారం చివరి తేదీగా నిర్ణయించబడింది. అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలైనందున, ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.తుది ఫలితాలను వచ్చే నెల 8న అధికారికంగా ప్రకటించనున్నారు..

