మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి బయల్దేరారు. తనయుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథరెడ్డితో కలిసి ఈ ఉదయం కేరళలోని పంబ నుంచి శబరిమల కొండ పైకి పయనమయ్యారు.కాషాయ దుస్తుల్లో ఉన్న పెద్దిరెడ్డి తలపై ఇరుముడితో నడుస్తుండగా, పక్కనే మిథున్ రెడ్డి, వెనుకగా ద్వారకానాథరెడ్డి అనుసరించారు. ఈ విషయాన్ని పెద్దిరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. వీడియోను కూడా పంచుకున్నారు.

