సినిమాఆగస్ట్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ధనుష్ ‘రాయన్’ స్ట్రీమింగ్

ఆగస్ట్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ధనుష్ ‘రాయన్’ స్ట్రీమింగ్

ధనుష్ కెరీర్‌లో 50వ చిత్రంగా వస్తున్న “రాయన్” సినిమా, థియేటర్లలో పెద్ద విజయాన్ని సాధించి, అభిమానుల మనసులను దోచుకుంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా, దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించారు. ఆయనతో పాటు సందీప్ కిషన్, ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి వంటి ప్రముఖులు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన “రాయన్” జులై 26న విడుదలై, కోలీవుడ్ లో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది, 550కి పైగా థియేటర్లలో విడుదలైంది.ఇప్పుడు, థియేటర్‌లో ఈ చిత్రాన్ని చూడటానికి అవకాశం మిస్ అయిన వారు, ఆగస్ట్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో “రాయన్” స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో ఇంట్లోనే సినిమా చూడొచ్చు. ధనుష్ నటనతో పాటు, దుషారా విజయన్, కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి నటులు తమ పాత్రల్లో మెరిసారు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన సంగీతం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “ఉసురే నీతానే” పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచి, రీల్స్ లో విస్తృతంగా షేర్ అవుతోంది.ఇలా థియేటర్లలోనే కాదు, ఇప్పుడు ఓటీటీలో కూడా “రాయన్” ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article