కనిగిరి :కనిగిరి నియోజకవర్గ ప్రజలకు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పర పాలకుల దాస్య శ్రుంఖలాల కింద భారతదేశం నలిగిపోతుంటే వందేమాతరం అనే విప్లవ నినాదంతో ఎందరో మహనీయుల బలిదానాలతో, ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగాలతో భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారన్నారు. దేశం పట్ల ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగేలా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఆ మహాత్ముల, ఆ మహనీయుల చరిత్రలు ఈ తరం వారికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దారపనేని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

