వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఈ నేల 25,26వ తేదీన జరిగే సమావేశాలు జయప్రదం చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ
ప్రజాభూమి, జీలుగుమిల్లి
వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఆగస్టు 24, 25 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ పిలుపు నిచ్చారు. బుధవారం నాడు సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సుందరయ్య కార్యాలయంలో రాజమండ్రి దానియేలు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, అటవీ, దేవదాయ, చుక్కల భూములు వంటి సమస్యలను పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా,మండల, గ్రామస్థాయి వరకు సదస్సులు నిర్వహించడం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేదలు, దళితులు, గిరిజనులు వారి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించడంతో పాటు ఆ సమస్యను త్వరితగతిన పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో అటవీ పోడు కొట్టిన గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇళ్ళు, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలనీ, రైతు, కౌలు రైతు యొక్క సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో పామాయిల్, మొక్కజొన్న, పొగాకు వంటి వాణిజ్య పంటలు విస్తారంగా పండుతున్న నేపథ్యంలో రైతు పండించే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని కోరారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపైన వివిధ రకాల సమస్యల పైన ఈ సమావేశాల్లో చర్చించబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశానికి ప్రాంతంలో ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాలకు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు తామా ముత్యాలమ్మ, కారం దుర్గ, అండుగుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

