టాప్ న్యూస్శ్రీహరికోట షార్ కేంద్రంలో పవన్ కళ్యాణ్..

శ్రీహరికోట షార్ కేంద్రంలో పవన్ కళ్యాణ్..

ఏపీ డిప్యూటీ సీఎం, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం తిరుపతి జిల్లా శ్రీహరికోటను సందర్శించారు. శ్రీహరికోటకు చేరుకున్న ఆయనకు.. అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ (షార్)‌లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలకు పవన్ హాజరయ్యారు. శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షార్‌లోని రాకెట్లను పవన్ పరిశీలించారు. అనంతరం చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ తరహా మోడల్‌ను సైంటిస్టులు పవన్ కళ్యాణ్‌కు బహుమతిగా అందించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article