Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుమద్యం పాలసీ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్‌ మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు

మద్యం పాలసీ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్‌ మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు మరోసారి ఊరట ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ను మరో రెండు వారాలు పొడిగించింది.ఈ కేసులో, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అందుబాటులో లేనందున, ఈడీ తరఫు న్యాయవాది చేసిన విచారణ వాయిదా వేయాలన్న అభ్యర్థనను జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.మార్చి 20న, భార్య అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, సుప్రీంకోర్టు అభిషేక్‌కు షరతులతో కూడిన ఐదు వారాల మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. పాస్‌‍పోర్టును అప్పగించాలని, హైదరాబాద్ మరియు ఢిల్లీని వదిలి వెళ్లరాదని ఆదేశించింది. మొబైల్ నెంబర్‌ను ఈడీ అధికారులకు అందుబాటులో ఉంచాలని, ఎప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొంది.ఈ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పలుమార్లు పొడిగించింది. జులైలో జస్టిస్ సంజయ్ కుమార్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్న తర్వాత, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ కేసు విచారణను మరో బెంచ్ ద్వారా కొనసాగించాల్సిందిగా ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article