ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసినా, లంచం తీసుకునే వారిని ట్రాప్ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటుంది అని డీజీ సీవీ ఆనంద్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ, వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏసీబీ అధికారుల నుండి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఘటన గురించి వివరించిన సీవీ ఆనంద్, జాయింట్ కలెక్టర్ ఎం.వీ. భూపాల్ రెడ్డి మరియు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని తెలిపారు. 14 గుంటల భూమిని ధరణీ పోర్టల్ లో నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించుటకు సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారని, ఆ మొత్తాన్ని జాయింట్ కలెక్టర్ కి అందజేయడం జరిగిందని చెప్పారు.ఫిర్యాదు దారుడి నుంచి నగర శివార్లలో డబ్బు తీసుకోవడం, ఆపై ఓఆర్ఆర్ దగ్గర జాయింట్ కలెక్టర్ కి అందేలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఏసీబీ టీమ్స్ రాత్రి అంతా చాకచక్యంగా వ్యవహరించి, ఇద్దరినీ రెడ్ హ్యండిగ్ గా పట్టుకున్నారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

