మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ కుటుంబం పై జరుగుతున్న చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్‌ను ప్రశ్నించే కారణంగా అక్రమ కేసులు పెడుతున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు.”ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారు. తప్పుడు కేసులకు వైసిపి నేతలు ఎవ్వరూ తలొగ్గరు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే, చూస్తూ ఊరుకోబోము,” అని హెచ్చరించారు.అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాల అమలుపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం విపక్ష నేతలపై భయపడటం కాదని, కానీ ఈ చర్యల ద్వారా ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.వెల్లంపల్లి శ్రీనివాస్, “ఇలాగే ప్రభుత్వ వ్యవహరిస్తే వైసిపి నేతలు తిరగబడే రోజులు వస్తాయి,” అని పేర్కొన్నారు. జోగి రమేష్ కక్ష సాధింపుల చర్యలో పావుగా మారారని కూడా తెలిపారు.

