మాజీ మంత్రి పేర్నినాని, జోగి రమేష్ కుటుంబం పై జరిగిన దాడి మరియు అరెస్టుల విషయమై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన పేర్కొన్నట్టు, జోగి రమేష్ కుటుంబాన్ని నేరం చేసినట్టు చూపుతూ తప్పుడు కేసులు పెట్టారని అన్నారు.పెర్నినాని మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులు చాలానే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మరియు ఆయన పక్కవారే ఈ ఆస్తులు కొనుగోలు చేశారు. ఇది అగ్రిగోల్డ్ ఆస్తి కాదు, రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని” తెలిపారు.అంతేకాక, చంద్రబాబు నాయుడు కావాలనే జోగి రమేష్ కుటుంబంపై ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. న్యాయపోరాటం చేస్తామని, ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

