తనకల్లు :తనకల్లు మండలం కోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ మిషన్ శక్తి ప్రోగ్రాం లో భాగంగా కోటపల్లి హైస్కూలలో బాలికలకు బాలియా వివాహాలు పై బాలిక విద్య బాలికలు హక్కులు బాధ్యతలు చట్టాల గురించి సంబంధించిన అధికారులు అవగాహన కల్పించడం జరిగింది సూపర్వైజర్ లక్ష్మీ దేవమ్మ మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సమాజంలో జరుగుతున్న ఆడపిల్ల వివక్షతను రూపుమాపాలని తెలిపారు సూపర్వైజర్ జయమ్మ మాట్లాడుతూ అమ్మాయిలకు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా వారికి దగ్గరలో ఉన్న అధికారులకు తెలియజేసి ఆపదనుండి బయటపడాలని ఇందుకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు మహిళా కార్యదర్శి రిహన ఫాతిమా .మాట్లాడుతూ అమ్మాయిలకు గుడ్ టచ్. బ్యాడ్ టచ్. గురించి వివరించారు అలాగే మహిళలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లు 1098. 112.100.181. ఈ నెంబర్ల గురించి అమ్మాయిలకు అవగాహన కల్పించారు మౌనిక మాట్లాడుతూ అమ్మాయిలకు 18 సంవత్సరాలు అబ్బాయిలకు 21 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతే వివాహం చేయాలని బాల్య వివాహాలు చట్ట నిత్య నేరం అని అందుకు సహరించిన ప్రతి ఒక్కరూ కి శిక్ష పడుతుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో వెంకటరమణ. వేమ నారాయణ. శ్రీనివాసులు. మహమ్మద్ రఫీ. భాగ్యమ్మ. సాయి లక్ష్మి. స్వరూప. శోభ రాణి. అంజనమ్మ విద్యార్థులు పాల్గొన్నారు


