50ఎం బి ఎఫ్ ఎ ప్రెసిడెంట్ జె.దేవానందం*
మార్కాపురం :మార్కాపురం ఎ బి ఎం స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనాలన్నిటిని తొలగించాలని అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె. దేవానందం సుమారు 50 మంది మహిళలు, 20 మంది పాస్టర్లు, 80 మంది పెద్దలు సోమవారం మార్కాపురం మున్సిపల్ కమిషనర్ కిరణ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా స్వాతంత్రం రాకపూర్వమే 1943 వ సంవత్సరములోనే మార్కాపురం బ్యాక్ చెస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ కు పాఠశాల విద్య నిమిత్తము ఎ బి ఎం హైస్కూల్ తో కలిపి ఎ 39.99 సెంట్లు అగ్రిమెంట్ ద్వారా అప్పగించడం జరిగినదని ఎ బి ఎం హైస్కూల్ యాజమాన్యం ద్వారా కొన్ని దశాబ్దాల నుంచి నిర్వహించబడుతుందన్నారు. ఈ నేపథ్యంలో టి. స్టీఫెన్ ప్రభాకర్ పాల్ అక్రమంగా నాదెళ్ల నాగవేణి కి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని, ఆ రిజిస్ట్రేషన్ చెల్లదని, ఎ బి ఎం, ఎం బి ఎఫ్ ఎ సంస్థలు పన్నులు మినహాయింపు గల మత పరమైన చారిటబుల్ ట్రస్ట్ అయినందున ఎవరైనా క్రయం విక్రయాలు చేయడానికి అధికారం లేదని తాము మార్కాపురం కోర్టులో కేసు వేయగా అక్రమముగా చేసిన రిజిస్ట్రేషన్ లు చెల్లవని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. అయినప్పటికీ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారాన్నారు. రెండు మూడు దశాబ్దాలుగా మేము న్యాయపరమైన పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. 2019 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ కు చెందిన ఎ బి ఎం స్థలములో అక్రమ నిర్మాణాలను, అనధికార కట్టడాలను గుర్తించి ఎనిమిది వారాలలోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ కు సూచనలిస్తూ
ఫిబ్రవరి 8, 2023 వ సంవత్సరంలో గౌరవ ఎ పి హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అప్పటినుంచి అప్పటినుంచి ఇప్పటివరకు మున్సిపల్ కార్యాలయము, సబ్ కలెక్టర్ కార్యాలయము లలో పలుమార్లు అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నామన్నారు. పలు పర్యాయములు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశామన్నారు. అయినప్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని వాపోయారు. గౌరవ ఎ పి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి భవన నిర్మాణాలకు మార్కాపురం టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ అప్రూవల్స్ జారీ చేస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఇటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేసి, దురాక్రమణదారులు అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగించి, ప్రస్తుతం చేస్తున్న నిర్మాణాలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ లో ఉన్న 42 బాప్టిస్ట్ సంఘములలోని వేలాది మంది క్రైస్తవులతో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. వైస్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి చిన్న కాశయ్య, కరెస్పాండింగ్ సెక్రెటరీ అబ్రాహాం డ్యానియేల్, ట్రెజరర్ జెడ్డా పీటర్ పాస్టర్, సీనియర్ పాస్టర్లు రెవ. పులుకూరి ఆండ్రూస్, రెవ. డా.ఎన్. విజయ భాస్కర్ రావు, రెవ. పసుమర్తి శామ్యూల్, సండ్రపాటి జాన్ తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
ఫోటో రైటప్ : మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పిస్తున్న జె. దేవానందం తదితరులు

