వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీ శనివారం పర్యటించారు. ఈ దుర్ఘటనలో బాగా దెబ్బతిన్న జీవీహెచ్ఎస్ స్కూల్, బెయిలీ వంతెన వంటి ప్రాంతాలను ఆయన సందర్శించారు. మోదీ పర్యటనలో కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి కూడా ఆయనతో ఉన్నారు. నిస్సహాయంగా ఉన్న బాధితులను పునరావాస కేంద్రంలో పరామర్శించి, వారి బాధను తెలుసుకున్నారు.ప్రధాని మోదీ స్కూల్ భవనం కూలిపోవడం, 582 మంది విద్యార్థులలో 27 మంది గల్లంతైన సమాచారంతో ఉద్వేగపూరితంగా స్పందించారు. స్కూల్ భవనం పునర నిర్మాణం కోసం ప్రణాళికలు తెలుసుకున్నారు.అంతరంగికంగా, 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించి, అక్కడ భారత సైన్యంతో సమీక్ష నిర్వహించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ తదితరులతో సమావేశం నిర్వహించి, దుర్ఘటనపై సమీక్షనిర్వహించారు.


