Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుకక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘జగన్ రెడ్డి: మంత్రి నిమ్మల రామానాయుడు

కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘జగన్ రెడ్డి: మంత్రి నిమ్మల రామానాయుడు

టీడీపీ నేత, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన జగన్ మోహన్ రెడ్డిని కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు అని పేర్కొన్నారు. రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘జగన్ రెడ్డి’ అని, జగన్ హింస, హత్యల గురించి మాట్లాడుతుంటే, రావణాసురుడు రామాయణం చెప్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.జగన్ పాలనను గత ఐదేళ్ల కాలంలో ప్రజా పాలన కంటికి కనిపించలేదని విమర్శించారు. ఆయన జగన్ పాలనను 144 సెక్షన్ పాలనగా అభివర్ణించారు. వైసీపీ అధినేత ప్రజలను తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.రామానాయుడు నంద్యాల జిల్లా సీతారామపురం గ్రామంలో దళితులకు చెందిన భూమిని వైసీపీ నాయకుడు నారపరెడ్డి లీజుకు తీసుకుని, లీజు సమయం పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వలేదని, పైగా వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆగస్టు 3న నారపరెడ్డి తన అనుచరులతో కలిసి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై దాడులు చేశారని చెప్పారు.వినుకొండ హత్యను కూడా టీడీపీ హత్యగానే ప్రచారం చేసి విఫలమైందని, అందువల్లే నంద్యాలలో ఈ డ్రామాకు తెరలేపారని రామానాయుడు అన్నారు. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకు విషప్రచారం చేస్తున్నారని, ఆయన శవ రాజకీయాలు చేయడంలో నేర్పరి అని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాల అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రామానాయుడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article